అత్యధిక వసూళ్లు సాధించిన మహేష్ మల్టీప్లెక్స్ !

అత్యధిక వసూళ్లు సాధించిన మహేష్ మల్టీప్లెక్స్ !

Published on Dec 26, 2020 9:57 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ప్రవేశించి ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అధునాతన హంగులతో మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా COVID-19 ఆపరేషన్ల సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్ నిలిచింది. కాగా ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాస్ వారు సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేస్తూ.. మాకు మీ నిరంతర మద్దతుతో ఇస్తూ ఏఎంబీ సినిమాస్ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ మరియు మా ప్రేక్షకులకు ధన్యవాదాలు.

మరో మైలురాయి సాధించడంలో మాకు సహాయపడినందుకు మీరందరికీ ధన్యవాదాలు అంటూ ఏఎంబీ సినిమాస్ పోస్ట్ చేసింది. మహేష్ చరీష్మా కారణంగా అతి తక్కువ కాలంలోనే ఏఎంబీ సినిమాస్ చాలా బాగా పాపులర్ అయింది. సెలబ్రిటీలు సైతం కుటుంబాలతో కలిసి అక్కడే సినిమాలు చూస్తున్నారు. ఏఎంబీ సినిమాస్ నిర్మించినందుకు మహేష్ కు ఏఎంబీ బృందానికి ప్రేక్షకులకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. అంతలా అది పాపులర్ అయింది.

తాజా వార్తలు