బంపర్ ఆఫర్ కొట్టేసిన అమలా పాల్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్న తదుపరి చిత్రం ‘ ఇద్దరు అమ్మాయిలతో’. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారు అందులో తాప్సీ ఒక కథానాయికగా ఎంపిక కాగా రెండవ కథానాయికగా అమలా పాల్ ని తీసుకోనున్నారు. ప్రస్తుతం అమలా పాల్ తన సినిమా షూటింగ్ నిమిత్తం అవుట్ డోర్ లో ఉన్నారు, అందుకని పూరి అమలా పాల్ కి ఒక ట్వీట్ పోస్ట్ చేసారు ‘ షూటింగ్ పూర్తి చేసుకుని త్వరగా రండి. రాగానే కథ చెబుతాను మరియు నా టీం అంతా కూడా నీతో పనిచెయ్యాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారని’ పూరి ట్వీట్ చేసారు.

ఈ విషయం పై స్పందించిన అమలా పాల్ ‘ మీతో పని చెయ్యడం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు నేను కూడా మీతో పనిచెయ్యాలని అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన డాన్స్ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు అని’ ఆమె సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకూ తెలుగులో సరైన హిట్ లేక డీలా పడిపోయిన అమలా పాల్ కి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రం సెప్టెంబర్ 20న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది.

Exit mobile version