సెకండ్ ఇన్నింగ్స్ తో కూడా మెప్పిస్తున్న అమల

సెకండ్ ఇన్నింగ్స్ తో కూడా మెప్పిస్తున్న అమల

Published on Aug 21, 2012 7:30 PM IST


కిరాయి దాదా, శివ, రాజా విక్రమార్క, ప్రేమ యుద్ధం, నిర్ణయం, ఆగ్రహం వంటి సినిమాల్లో కథానాయికగా నటించి ఆ తరువాత అక్కినేని నాగార్జునని వివాహమాడిన అమల ఆ తరువాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. వివాహం తరువాత మంచి ఇల్లాలుగా ఉంటూ ఆమె బ్లూ క్రాస్ అనే సంస్థని స్థాపించి బాగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు 25 సంవత్సరాల తరువాత ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారభించారు. సున్నితమైన కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో ఆమె పాత్రకి సంభందించిన స్టిల్స్ ఈ రోజు విడుదల చేయగా చుసిన ప్రతి ఒక్కరు ఆమెని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

తాజా వార్తలు