ఈ ఏడాది అనుకోకుండా సంభవించిన విపత్తుకు అడ్డంగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ మళ్ళీ తన సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. అలా ప్రస్తుతం సోనూ సూద్ బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో “అల్లుడు అదుర్స్” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమాలో సోనూ సూద్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నారో కానీ ఖచ్చితంగా కొత్త సోనూ సూద్ ను మాతరం మేకర్స్ చూపించేలా ఉన్నారని చెప్పాలి. లేటెస్ట్ గా విడుదల చేసిన ఓ మేకింగ్ వీడియోలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి సోనూ సూద్ అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేస్తూ కనిపించారు.
టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ కొరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ సారథ్యంలో చేస్తున్న ఈ సాంగ్ లో సోనూ కూడా ఉన్నారు. అయితే ఇది వరకు ఎప్పుడూ ఇలా ఓ డైరెక్ట్ సాంగ్ లో సోనూ సూద్ డాన్స్ చేసింది లేదు, అలాగే హిందీ సినిమాల్లో కూడా పెద్దగా దాఖలాలు లేవు.
దీనితో ఈ సినిమాలో కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నారు.
#AlluduAdhursOnSets @BSaiSreenivas, @SonuSood dancing
For a special song, Shooting coverage shot for you all.???? ????Jan 15th 2021 release ????#SanthoshSrinivas @ThisIsDSP @prakashraaj @NabhaNatesh @ItsAnuEmmanuel @shekarmaster #AvinashKolla #SumanthMovieProductions #AAonJan15th pic.twitter.com/1sGEXdcSXG
— ???????????????????????????????????????????? (@UrsVamsiShekar) December 29, 2020