త్వరలోనే గోదావరి తీరంలో సందడి చేయనున్న అల్లు శిరీష్

త్వరలోనే గోదావరి తీరంలో సందడి చేయనున్న అల్లు శిరీష్

Published on Aug 14, 2012 6:49 PM IST


టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్న సినిమా ‘ గౌరవం’. ఇటీవలే మైసూర్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఆగష్టు రెండవ అర్ధభాగంలో ప్రారంభం కానుంది. రెండవ షెడ్యూల్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరగనుంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను గోదావరి నది పరిసర ప్రాంతాల్లో కూడా చిత్రీకరించనున్నారు. సినిమా చిత్రీకరణకి ఎలాంటి ఆటంకాలు రాకుండా, వేగంగా చిత్రీకరణ పూర్తవుతున్నందుకు ఈ చిత్ర టీం ఎంతో సంతోషంగా ఉన్నారు.

తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కథా రచయిత బి.వి.ఎస్ రవి ఈ చిత్ర తెలుగు వర్షన్ కి సంభందించిన స్క్రిప్ట్ పనులను చూసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు