కొంత కాలం క్రితం యంగ్ హీరో అల్లు శిరీష్ ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉండేవాడు. అలాగే అతని ఒపినియన్ ని నిక్కచ్చిగా చెప్పేవాడు. కానీ కొద్ది నెలల క్రితం శిరీష్ 1 లక్ష ఫాలోవర్స్ ఉన్న తన ట్విట్టర్ అకౌంట్ ని డెలీట్ చేసాడు. తాజాగా అల్లు శిరీష్ సోషల్ మీడియాలోకి మళ్ళీ ఎంటర్ అయ్యాడు. శిరీష్ మళ్ళీ ట్విట్టర్ లో జాయిన్ అయ్యాడు. అల్లు శిరీష్ అకౌంట్ – twitter.com/AlluSirish.
శిరీష్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ‘కొత్త జంట’ సినిమాలో నటిస్తున్నాడు. రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొత్త జంట సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది.
అల్లు శిరీష్ వెల్ కమ్ బ్యాక్ టు ట్విట్టర్