ఖరారైన ఇద్దరమ్మాయిలతో ఆడియో రిలీజ్ డేట్

ఖరారైన ఇద్దరమ్మాయిలతో ఆడియో రిలీజ్ డేట్

Published on Apr 23, 2013 12:01 PM IST
First Posted at 12:02 on Apr 23nd

Iddarammailatho
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న స్టైలిష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ 28న హైదరాబాద్లో జరగనుంది. ఈ వేడుకకి వేదికగా శిల్పకళా వేదిక అని అనుకుంటున్నారు కానీ అధికారిక అనౌన్స్ మెంట్ త్వరలోనే చేసే అవకాశం ఉంది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో బన్ని సరసన అమలా పాల్, కేథరిన్ లు హీరోయిన్స్ గా జోడీ కట్టారు. ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం స్పెయిన్, బ్యాంకాక్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు