స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ‘రేసు గుర్రం’. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. రెండవ షెడ్యూల్ కోసం ఈ టీం జూలై 1న యూరోప్ వెళ్లనుంది. యూరోప్ లో అల్లు అర్జున్, శృతి హసన్ లపై ఎనిమిది రోజుల పాటు రెండు రొమాంటిక్ సాంగ్స్ ని షూట్ చేయనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ ముగిసిన తరువాత హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. నల్లమలపు బుజ్జి , డా.కె వెంకటేశ్వర రావులు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమకి కథని అందించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం తరువాత విడుదలకావచ్చునని సమాచారం.