వేసవిలో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దపోటీ నెలకొననుంది. సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు ఈ కదనరంగంలో తలపడనున్నాయి. లెజెండ్ సినిమా మార్చ్ 28న మనముందుకు రానుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అల్లు బాబు రేస్ గుర్రం కూడా అదే రోజు వస్తుందని ప్రకటించడంతో ఇప్పుడు ఈ సినిమాలపై ఆసక్తి నెలకొంది. సినిమా రంగానికి గానూ మార్చ్ 28న విడుదల చేస్తే వేసవికి లాభదాయకంగా వుంటుందని అంచనా
రేస్ గుర్రం లో శృతిహాసన్ హీరోయిన్. సలోని ముఖ్యపాత్రధారి. సురేందర్ రెడ్డి దర్శకుడు. లెజెండ్ ను బాలయ్య బాబు ను సింహంలా చూపించడానికి బోయపాటి కసరత్తు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలని కోరుకుందాం.