త్వరలో ప్రారంభంకానున్న అల్లు అర్జున్ ,సురేందర్ రెడ్డి చిత్రం

త్వరలో ప్రారంభంకానున్న అల్లు అర్జున్ ,సురేందర్ రెడ్డి చిత్రం

Published on Mar 1, 2013 6:30 PM IST

allu-arjun-and-surendra-red
వి. వి. వినాయక్ , త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ లతో కలిసి పనిచేసిన అల్లు అర్జున్ ఇప్పుడు తొలిసారిగా సురేందర్ రెడ్డితో కలిసిపనిచేయనున్నాడు . 2012 అక్టోబర్లో లాంచనంగా ఈ చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘ఇద్దరమ్మాయిలతో ‘ చిత్రీకరణలో స్పెయిన్ లో తీరికలేకుండా వున్నాడు. ఈ నెల చివర్నుంచి సురేందర్ రెడ్డి చిత్రంలో అల్లు అర్జున్ పాల్గొంటాడని వినికిడి. ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. మిగిలిన నటీ నటులను ఇంకా ఖాయం చేయాల్సివుంది. నల్లమలపు బుజ్జి మరియు డా . కె వేంకటేశ్వర రావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఏం మాయ చేసావే’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మనోజ్ పరమహంస ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు. ఈ చిత్రానికి సంభందించిన మరి కొన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

తాజా వార్తలు