థమన్ ని పొగిడేసిన అల్లు అర్జున్

allu-arjun-and-thaman

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ థమన్ మ్యూజిక్ విషయంలో చాలా హ్యాపీ గా ఉన్నాడు. ఆయన పబ్లిక్ గా ఫేస్ బుక్ పేజ్ ద్వారా థమన్ ని మెచ్చుకున్నాడు. ‘రేస్ గుర్రం కి థమన్ అదిరిపోయే సాంగ్స్ కంపోజ్ చేసాడు. ఈ ఆడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని’ అల్లు అర్జున్ అన్నాడు.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version