ఈమధ్య మన తెలుగు హీరోలకు బాలీవుడ్ మీదకి మనసు మళ్లుతోంది. చేసే సినిమాల్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి అక్కడ కూడా పాగా వేయాలని చూస్తున్నారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. అయితే ఏదో చేశాం అంటే చేశాం అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ ద్వారా హిందీలోకి అడుగుపెట్టాలని, వేసే మొదటి అడుగు ద్వారానే సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనేది బన్నీ ఆలోచన.
త్వరలోనే ‘అల వైకుంఠపురములో’ హిందీలోకి శాటిలైట్ డబ్ అవుతుందని అంటున్న ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని పలు భాషల్లోకి డబ్ చేస్తామని అంటున్నారు. అంతేకాదు హిందీలో సినిమా చేయాలనే కోరిక ఉందన్న ఆయన మంచి డైరెక్టర్, నిర్మాత దొరికితే కంటెంట్ ఉన్న సినిమాతో ఎంట్రీ ఇస్తానని, తనకు మొదట రాజ్ కుమార్ హిరానీగారితో వర్క్ చేయాలని ఉందని అలాగే సంజయ్ లీలా భన్సాలీ, ఆనంద్ ఎల్ రాయ్ వర్కింగ్ స్టైల్ అంటే ఇష్టమని అన్నారు. బన్నీ ఆలోచనల్ని చూస్తే ఆయన బాలీవుడ్ ఆరంగేట్రం బలంగానే ఉంటుందని అనిపిస్తోంది.