స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ” జులాయి”. ఈ చిత్రం జూలై 13 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. యంగ్ తరంగ్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదలై శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆడియో వేడుకలో విడుదల చేసిన థియేటర్ ట్రైలర్ ఈ చిత్రం పై ఉన్న అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఎంతో కష్టపడి పనిచేశారు మరియు ఈ చిత్రం విజయం సాదిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. బన్నీ ఈ చిత్ర విజయంతో టాలీవుడ్లో హై మార్కెట్ ఉన్న హీరోల జాబితాలో చేరిపోవాలనుకుంటున్నాడు. త్రివిక్రమ్ కూడా హిట్ కొట్టాలని ఎంతో కష్టపడి, కసితో చేసిన ఈ చిత్రంతో బన్నీ అనుకున్న ఆశలు తీరుతాయా? లేదా? ఈ చిత్రం తో వీరిద్దరూ హిట్ సాదిస్తారా? లేదా? అనే దాని కోసం ఇంకొంతకాలం వేచి చూడాలి. గోవా బ్యూటీ ఇలియానా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఎస్. రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.