ఇకపై అల్లు అర్జున్ సినిమాలు చాలా కాస్ట్లీ

‘అల వైకుంఠపురములో’ విజయంతో అల్లు అర్జున్ మార్కెట్ స్థాయి పూర్తిగా మారిపోయింది. రూ.80 నుండి రూ. 85 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం వసూళ్ల పరంగా నాన్ బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు ప్రాఫిట్ జోన్లోకి ప్రవేశించారు. బన్నీ కెరీర్లో కూడా ఇవే అత్యుత్తమ వసూళ్లుగా నిలిచాయి. దీంతో బన్నీ తర్వాతి చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఆ సినిమా హక్కుల్ని భారీ ధరకు విక్రయించాలని భావిస్తున్నారట.

పైగా ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తర్వాత సుకుమార్ చేస్తున్న చిత్రం ఇదే కావడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంత భారీ మొత్తమైనా సరే హక్కుల్ని కొనడానికి సిద్దంగా ఉన్నారు. ఇకపోతే రష్మిక మందన్న కథానాయకిగా నటించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టెస్ట్ షూట్ పూర్తికాగా త్వరలో రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

Exit mobile version