“పుష్ప” విషయంలో చాలా ఎగ్జైట్ గా ఉన్న బన్నీ.!

“పుష్ప” విషయంలో చాలా ఎగ్జైట్ గా ఉన్న బన్నీ.!

Published on Nov 13, 2020 2:06 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. పక్కా రఫ్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో బన్నీ మొట్ట మొదటిసారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడని అభిమానులు ఎంతైతే ఎగ్జైట్ గా ఫీలవుతున్నారో ఈ సినిమా చేస్తుండడంతో బన్నీ కూడా అంతే హై లో ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారట.

ముఖ్యంగా ఈ చిత్రం తాలుకా కథ చాలా కొత్తగా ఉంటుందని అంతే కాకుండా తాను ఇంత వరకు చెయ్యని సాలిడ్ స్క్రిప్ట్ ను సుకుమార్ తయారు చేసారని అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో బన్నీ అభిమానులు ఎక్కడ ఉన్నా వారికి స్పెషల్ ట్రీట్ లా తీర్చిదిద్దారని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా విషయంలో బన్నీ బాగా ఎగ్జైట్ గా ఉన్నారట. ఈ చిత్రానికి బన్నీ సుకుమార్ ఆల్ టైం హిట్ కాంబో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు