హీరో విజయ్ దేవరకొండ బట్టల బ్రాండ్ రౌడీ వేర్ గురించి తెలిసిందే. ఈ బట్టల్ని విజయ్ టాలీవుడ్లో కొంతమంది హీరోలకు ప్రజెంట్ చేశారు. వారిలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. బన్నీకి కొన్ని టీషర్ట్స్ విజయ్ ప్రజెంట్ చేశారు. వాటిని తీసుకున్న బన్నీ థ్యాంక్స్ చెబుతూ చెప్పినట్టే బట్టలు పంపావ్.. ‘అల వైకుంఠపురములో’ విజయోత్సవ సంబరాల సమయంలో నన్ను ఈ బట్టల్లోనే చూస్తావ్ అన్నారు.
ఆ మాట ప్రకారమే ఆ దుస్తుల్నే వేసుకుని వేడుకల్లో భాగంగా బన్నీ నిన్న తిరుపతికి కుటుంబ సమేతంగా వెళ్లారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్ రౌడీ బ్రాండుకు మంచి పాపులారిటీ లభిస్తోంది. ఇకపోతే ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ సంక్రాంతి విన్నర్ అయింది.