గోపీచంద్ మలినేని – దిల్ రాజుతో జతకట్టనున్న అల్లు అర్జున్

dil raju new movie

‘బలుపు’ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని మంచి విజయాన్ని అందుకున్నాడు. తన తర్వాత సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నాడు. ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి గోపీచంద్ మలినేని తెలియజేశాడు.

‘ ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. నేను ‘కంత్రి’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు దిల్ రాజు గారు నాకు డైరెక్టర్ గా చాన్స్ ఇచ్చారు, కానీ ఆ సినిమా ఎందుకో సెట్ అవ్వలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన బ్యానర్ లో సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని’ గోపీచంద్ మలినేని అన్నాడు.

తమిళ్ లో ఫేమస్ డైరెక్టర్ మురుగదాస్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తున్న ఓ సినిమాకి కూడా దర్శకత్వం వహించనున్నట్లు గోపీచంద్ మలినేని తెలియజేసాడు.

Exit mobile version