ఆ హీరోయిన్ గ్రేట్ డాన్సర్ : అల్లు అర్జున్

ఆ హీరోయిన్ గ్రేట్ డాన్సర్ : అల్లు అర్జున్

Published on Aug 26, 2012 9:55 AM IST


ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ డాన్సర్లలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు, అలాంటి అల్లు అర్జున్ ఒక కథానాయికకి బెస్ట్ డాన్సర్ అనే కితాబు నిచ్చారు. ఆ కితాబునందుకున్న హీరోయిన్ మరెవరో కాదండి మన మిల్క్ బ్యూటీ తమన్నా.

‘ ప్రస్తుతం మన ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్సులు చేయడంలో హీరోలతో పాటు హీరోయిన్లు పోటీ పడుతున్నారు. తమన్నా చాలా గ్రేట్ డాన్సర్ మరియు ఆమెలో చాలా గ్రేస్ ఉంది. ‘బద్రినాథ్’ మరియు ‘రచ్చ’ సినిమాల్లో చేసిన డాన్సులతో ఆమె మంచి డాన్సర్ అని నిరూపించుకున్నారు. తమన్నా కాకుండా ఛార్మి మరియు శ్రియ కూడా మంచి డాన్సర్లు అని’ అల్లు అర్జున్ అన్నారు. తమన్నా ఈ సంవత్సరం కూడా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మరియు ‘రెబల్’ చిత్రాలతో మరో సారి తన డాన్సులతో కనువిందు చేయనున్నారు

తాజా వార్తలు