అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?

SSMB29-AA22

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఇంట్రడక్షన్ సీన్స్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే, ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందిస్తున్న అట్లీ ఈ చిత్రాన్ని 2026లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఇప్పుడు అది 2027కి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో రాజమౌళి-మహేష్ బాబు కలయికలో వస్తున్న SSMB29 కూడా విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

దీంతో అల్లు అర్జున్, మహేష్ బాబు ఒకేసారి 2027లో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం అనివార్యంలా కనిపిస్తోంది. మరి నిజంగానే అభిమానులు 2027 వరకు వేచి ఉండాలా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version