కొత్త సినిమాల్ని కొనే పనిలో అల్లు అరవింద్

కొత్త సినిమాల్ని కొనే పనిలో అల్లు అరవింద్

Published on Jan 30, 2020 9:24 PM IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఆయన కూడా ఆ దిశగా అడుగులు వేసి అమెజాన్, జీ 5, హాట్ స్టార్ మాదిరిగానే ఆహా పేరుతో ఒక డిజిటల్ యాప్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం దీని కోసం కొత్త సినిమాల్ని కొనే పనిలో ఉన్నారాయన. మొదటగా నిఖిల్ యొక్క ‘అర్జున్ సురవరం’ చిత్ర డిజిటల్ హక్కుల్ని కొన్న ఆయన తాజాగా రాజ్ కందుకూరి నిర్మించిన ‘చూసి చూడంగానే’ హక్కుల్ని కైవసం చేసుకున్నారు.

అలాగే కార్తి సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’ హక్కుల్ని కూడా కొనే ప్రయత్నంలో ఉన్నారు. ఇకపై సొంతగా నిర్మించే మెగా హీరోల సినిమాలన్నీ ‘ఆహా’లోనే ఉండనున్నాయి. కొత్త సినిమాల వరకు సబ్ స్క్రిప్షన్ చేసుకుంటేనే వీక్షించే వీలుండగా పాత హిట్ సినిమాల్ని మాత్రం ఫ్రీగానే చూసే వీలు కల్పించారు. అలాగే సబ్ స్క్రిప్షన్ చార్జీలను కూడా ఇతర ఒటీటీలతో పోల్చితే తక్కువగానే ఉంచి వీక్షకుల్ని ఆకర్షిస్తున్నారు అరవింద్.

తాజా వార్తలు