వెరైటీగా జరగనున్న సుడిగాడు ఆడియో ఫంక్షన్

వెరైటీగా జరగనున్న సుడిగాడు ఆడియో ఫంక్షన్

Published on Jul 23, 2012 10:54 AM IST


కామెడి కింగ్ ‘అల్లరి’ నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘సుడిగాడు’ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో హిట్ అయిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలను తీసుకొని వాటికి పేరడీగా కొన్ని సన్నివేశాలను ఈ చిత్రంలో చిత్రీకరించారు. ఇదేవిధంగా ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ ని కూడా ఇప్పటివరకు జరిగిన ఆడియో ఫంక్షన్లకి పేరడీగా నిర్వహించాలని నరేష్ మరియు అతని టీం నిర్ణయించుకున్నారు. ఈ రోజు సాయంత్రం ‘సుడిగాడు’ చిత్ర ‘ హెక్సా ప్లాటినం డిస్క్’ వేడుకని హైదరాబాద్లో జరపనున్నారు. ఏంటి అర్ధం కాలేదా? ఆడియో ఫంక్షన్ కంటే ముందే ఈ చిత్రం యొక్క హెక్సా ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకోనుంది.! ఏంటి అవాక్కయ్యారా!

మామూలుగా ఆడియో మార్కెట్లోకి విడుదలై పాటలకి మంచి స్పందన వస్తే, అప్పుడు హెక్సా ప్లాటినం డిస్క్ వేడుకలు జరుపుతారు. ఆడియో రిలీజ్ కంటే ముందు సక్సెస్ వేడుక చేసి నరేష్ మరియు అతని టీం ప్రేక్షకులను నవ్వించాలనుకుంటున్నారు. ఈ చిత్ర ఆడియోను కూడా ఈ రోజు జరగబోయే వేడుకలో విడుదల చేయనున్నారు. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస రావు సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజా వార్తలు