అల్లరి నరేష్ ‘జంపు జిలాని’ అందానికి సిద్దమవుతున్నాడా?

Allari-Naresh
కామెడీ కింగ్ అల్లరి నరేష్ డైరెక్టర్ ఇ.సత్తిబాబు కాంబినేషన్లో నాలుగో సినిమా చేయడానికి శ్రీకారం చుట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘నేను’, ‘బెట్టింగ్ బంగార్రాజు’, ‘యముడికి మొగుడు’ సినిమాలు వచ్చాయి. మళ్ళీ వీరిద్దరూ మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి ‘జంపు జిలాని'(వర్కింగ్ టైటిల్) సినిమాతో మనముందుకు రానున్నారు. అంబికా కృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇది కాకుండా మరో రెండు అల్లరి నరేష్ సినిమాలు విడుడుదలకు సిద్దమవుతున్నాయి. అందులో ముందుగా సమ్మర్ కానుకగా ‘యాక్షన్ 3డి’ సినిమా రానుంది. నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళిన రోడ్ ట్రిప్ ని అనిల్ సుంకర చాలా కామెడీగా తెరకెక్కించాడు. ఇదికాకుండా దేవీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కెవ్వు కేక’ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.

Exit mobile version