మరికాసేపట్లో అల్లరి నరేష్ లడ్డూ బాబు ఫస్ట్ లుక్

మరికాసేపట్లో అల్లరి నరేష్ లడ్డూ బాబు ఫస్ట్ లుక్

Published on Dec 21, 2013 6:30 PM IST

Allari-Naresh
రవిబాబు దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ‘లడ్డూ బాబు’. సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఊబకాయంతో, దానికి సరిపడే మేక్ అప్ తో కనిపించనున్నాడట. దీనికోసం మన నరేష్ కొంతమంది హాలీవుడ్ మేక్ అప్ ఆర్టిస్ట్ల దగ్గర డిజైన్లు రూపొందించాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ డిసెంబర్ 22న విడుదలకానుంది

సన్నగా రివటలా వుండే అల్లరి నరేష్ ఇలా కొత్తగా కనిపించడం ఇదే మొదటిసారి. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారధి కొడుకు రాజేంద్రప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు

ఈ లడ్డూ బాబు కాకుండా నరేష్ ఈ సత్తి బాబు దర్శకత్వంలో కామిడీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇషా చావ్లా మరో హీరోయిన్. అంబికా కృష్ణ మరియు రిలయాన్స్ ఎంతెర్తైనెమెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు