ఆఫ్రికాలో కూడా అల్లరి నరేష్ కి ఫాన్స్.!

ఆఫ్రికాలో కూడా అల్లరి నరేష్ కి ఫాన్స్.!

Published on Aug 23, 2012 4:24 AM IST


అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘సుడిగాడు’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర పబ్లిసిటీ టీం ఈ చిత్రాన్ని చాలా వినూత్నంగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తున్నారు. ఈ రోజు హాస్యానికి పెద్ద పీట వేస్తూ పోస్టర్ చూడగానే నవ్వు రావాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి సంభందించిన కొన్ని పోస్టర్లను విడుదల చేసారు. అందులో అల్లరి నరేష్ ఆఫ్రికన్ ఫాన్స్ ని చూపిస్తూ ఒక సూపర్బ్ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్లో అల్లరి నరేష్ ఆఫ్రికన్ అల్లరి నరేష్ ఫాన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ జెమో మలివ చేతులమీదుగా పుష్ప గుచ్చం అందుకుంటున్నట్లు సృష్టించారు. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో ‘సుడిగాడు’ టికెట్ల కోసం థియేటర్ బయట బారులు తీరిన నైజీరియన్ల ఫోటోను వేసారు. ఇలాంటి కొత్త రకమైన ప్రచారం సినీ అభిమానులను తెగ ఆకట్టుకొంటోంది మరియు ఈ చిత్రం చాలా కామెడీగా ఉంటుందని భావిస్తున్నారు.

తాజా వార్తలు