టాలీవుడ్ లోని సూపర్ హిట్ సినిమాల్లోని సన్నవేశాలను తీసుకొని పేరడీ చేస్తూ కామెడీ కింగ్ అల్లరి నరేష్ తీసిన ‘సుడిగాడు’ సినిమా యు.ఎస్ బాక్స్ ఆఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే యు.ఎస్ బాక్స్ ఆఫీసు దగ్గర 100,000 డాలర్ల షేర్ కలెక్ట్ చేసింది. అల్లరి నరేష్ సినిమాకి ఇలాంటి సూపర్బ్ కలెక్షన్స్ రావడం చెప్పుకోదగ్గ విషయం మరియు అభినందనీయ అంశం.
యు.ఎస్ లో మొత్తంగా 30 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. విడుదలైన అన్ని ఎరియాల్లోనూ మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. ఈ చిత్రం సినీ అభిమానులను మరియు అర్బన్ ఏరియా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అల్లరి నరేష్ సుడి తిప్పిన చిత్రం ‘సుడిగాడు’.