కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘లడ్డూబాబు’ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేసారు. నరేష్ మార్చుకున్న తన లుక్ ని చూసి అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఈ సినిమాలో బాగా స్థూలకాయం ఉన్న పాత్రలో నటిస్తున్న నరేష్ ని ఈ పోస్టర్ లో అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. యుకె నుంచి వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ నరేష్ కి మేకప్ చేసాడు. రవి బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని రాజేంద్ర త్రిపురనేని నిర్మిస్తున్నాడు.
ట్విట్టర్ లో లడ్డూబాబు ఫస్ట్ లుక్ కి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో షాక్ అయ్యారని తెలియజేశారు. లడ్డూబాబు ఫస్ట్ లుక్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ఇంతకు మించి ఈ సినిమాకి సంబందించిన వివరాలు ఇంకేమీ తెలియలేదు. మాములుగా రవిబాబు సినిమా మొత్తం పూర్తయ్యేంత వరకు సినిమాకి సంబందించిన వివరాలను బయటకి రానివ్వరు. చక్రి ఈ సినిమాకి సంగీతం అందించాడు.