మెగాస్టార్ టైటిల్ ని వాడుకుంటున్న అల్లరోడు

మెగాస్టార్ టైటిల్ ని వాడుకుంటున్న అల్లరోడు

Published on Aug 22, 2012 3:54 PM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రానికి ‘యముడికి మొగుడు’ అనే టైటిల్ ఖరారు చేసారు మరియు ‘ఈ నెల తక్కువోడు’ అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. రిచా పనాయ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్లీ మూవీస్ కార్పోరేషన్ నిర్మిస్తోంది. ‘యముడికి మొగుడు’ అనే టైటిల్ మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా పేరు. బహుశా ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావడం వల్ల ఈ చిత్ర టైటిల్ ని విడుదల చేసారు.

ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయాజీ షిండే యముడి పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటి రమ్య కృష్ణ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు మరియు సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, కృష్ణ భగవాన్, రఘుబాబు, చలపతి రావు, ఎ.వి.ఎస్ మరియు మాస్టర్ భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు