50వ సినిమా కోసం పెద్ద ప్లాన్ వేసిన అల్లరోడు

Allari-Naresh
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ బిజీగా వరుసగా సినిమాలు చేస్తున్న హీరో అల్లరి నరేష్. జూన్ లో నరేష్ నటించిన ‘యాక్షన్ 3డి’, ‘కెవ్వు కేక’ సినిమాలు విడుదల కానున్నాయి. త్వరలోనే మరికొన్ని సినిమాలు మొదలుకానున్నాయి. ఇటీవలే రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కే ఓ కామెడీ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అది కాకుండా సత్తిబాబు, సాయి కిషోర్, శ్రీనివాస రెడ్డి, చిన్ని కృష్ణలతో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే నరేష్ నటుడిగా 49 సినిమాలు పూర్తిచేయనున్నాడు. అలాగే ఇండస్ట్రీలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం అల్లరి నరేష్ తన 50వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. గతంలో అతనికి సినిమా డైరెక్ట్ చేయాలనే కోరిక ఉందని, ఈవివి బ్యానర్ ని ముందుకు తీసుకెళ్లాలని ఉందన్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ నా 50వ సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నాను. ఆ సినిమా మా నాన్నగారు స్థాపించిన ఈవివి బ్యానర్ పై ఉంటుంది. మా అన్నయ్య ఆర్యన్ రాజేష్ నిర్మిస్తాడు. నేను హీరోగా నటించే ఈ సినిమా పూర్తి వివరాలను మా నాన్నగారి పుట్టినరోజు నాడు అనగా జూన్ 10వ తేదీన తెలియజేస్తామని’ అన్నాడు. ప్రస్తుతం అందరి కళ్ళు ‘యాక్షన్ 3డి’ సినిమాపైనే ఉన్నాయి.

Exit mobile version