తూర్పు గోదావరిలో థియేటర్లు అన్ని బంద్ !

తూర్పు గోదావరిలో థియేటర్లు అన్ని బంద్ !

Published on Mar 18, 2020 1:26 PM IST

కరోనా సినిమాల మీద భారీ ప్రభావమే చూపిస్తోంది. పైగా కరోనా కలకలంతో ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలతో పాటు అన్ని సంస్థలు మరింత అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే భద్రతా చర్యలతో పాటు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకువెళ్తున్నారు. అందులో సినిమా థియేటర్స్ ను కొన్ని రోజుల పాటు బంద్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరిలో కూడా థియేటర్స్ ను బంద్ చేస్తున్నారు.

కాగా ‘మార్చి 20, శుక్రవారం నుండి తదుపరి నోటీసు వచ్చేవరకు తూర్పు గోదావరిలో అన్ని థియేటర్లు మూసివేయబడతాయని..’ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ & ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. ఇక ఇప్పటికే కరోనా ప్రభావం వల్ల థియేటర్స్ కలెక్షన్స్ లేక వెలవెలబోతున్నాయి. ఇన్నాళ్ళూ చైనా, ఇరాన్ లాంటి దేశాలకి పరిమితం అయిన ఈ వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు వేగంగా వచ్చేస్తోండటంతో అందరిలోనూ భయం మొదలైపోయింది. ఇక కరోనా భయం పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా సినిమా థియేటర్స్ కు కష్టనష్టాలు తప్పవు ఏమో.

తాజా వార్తలు