శ్రీకాంత్ ఒప్పుకోకపోతే ‘ఆల్ ది బెస్ట్’ సినిమా చేసేవాణ్ణి కాదు : జె.డి


శ్రీ కాంత్ హీరోగా, లక్కీ శర్మ కథానాయికగా తెరకెక్కిన చిత్రం ” ఆల్ ది బెస్ట్ “. ఈ చిత్రంలో జె.డి చక్రవర్తి ఒక ప్రముఖ పాత్రని పోషించారు. ఈ చిత్రం రేపు విడుదల కానున్న సందర్భంగా నిన్న విలేఖరుల సంమవేశం ఏర్పాటు చేశారు. శ్రీ కాంత్ మాట్లాడుతూ జె.డి తను మంచి స్నేహితులని, ఈ చిత్రం మా ఇద్దరి కాంభినేషన్లో వస్తున్న మూడవ చిత్రం ఇది, ఇందులో ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డిల మార్కుతో కూడుకున్న కామెడీ ఉంటుందని ఆయన అన్నారు’. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన జె.డి చక్రవర్తి మాట్లాడుతూ ” ఈ చిత్రంలో కామెడి చాలా బాగుంటుందని, ‘మనీ మనీ మోర్ మనీ’ సినిమాలో కామెడీకి పూర్తి న్యాయం చేయలేకపోయానని కొంత అసంతృప్తి ఉండేదని, అది ఈ చిత్రంతో తీరిపోతుందని అన్నారు. శ్రీకాంత్ ఈ చిత్రం ఒప్పుకోకపోయి ఉంటే ఈ చిత్రం చేసి ఉండేవాణ్ణి కాదని ఆయన అన్నారు. ఈ చిత్ర నిర్మాత సాంబశివరావు చిత్ర నిర్మాణంలో మాకు అన్నివిధాలా అండగా ఉన్నారని ఆయన అన్నారు”. ఈ చిత్రానికి హేమ చంద్ర సంగీతాన్ని అందించారు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి మా తరపున ‘ఆల్ ది బెస్ట్’ తెలియజేస్తున్నాం.

Exit mobile version