బెల్లంకొండ సినిమాకు ప్రభాస్ దర్శకుడు ?


టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి యాక్షన్ సినిమాల మీదే ఎక్కువగా దృష్టిపెట్టిన సాయి శ్రీనివాస్ హిందీలోకి ఎంట్రీ ఇచ్ఛే సినిమా కూడ యాక్షన్ సినిమానే అయ్యుండాలని భావించి హెవీ యాక్షన్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. అది కూడ తెలుగు సినిమానే కావడం విశేషం. తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రభాస్, రాజమౌళిల ‘ఛత్రపతి’ని హిందీలోకి రీమేక్ చేయనున్నారు.

చూజ్ చేసుకున్నది ప్రభాస్ సినిమానే కావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక దర్శకుడిగా కూడ ప్రభాస్ సినిమా దర్శకుడినే ఎంచుకున్నారు. అతనే సుజీత్ కుమార్. ‘సాహో’ సినిమాతో సుజీత్ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యారు. ఆ చిత్రం తెలుగులో ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా హిందీలో మాత్రం మంచి సక్సెస్ సాధించింది. అందుకే ఆయన్నే దర్శకుడిగా ఎంచుకున్నారని సినీ వర్గాల టాక్. ఈ కాంబినేషన్ గనుక సెట్టైతే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీకి మంచి హైప్ దొరికినట్టే అవుతుంది.

Exit mobile version