ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. చాలా కాలం అనంతరం పవన్ మొదలు పెట్టిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నిన్నటితోనే షూట్ కంప్లీట్ కావడంతో మేకర్స్ గుమ్మడికాయ కొట్టేసారు.
మరి ఇక దీనితో వరుస అప్డేట్స్ కోసమే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతలోపలే ముందుగా టీజర్ కొద భారీ అంచనాలతో ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ లేటెస్ట్ టాక్ ఏంటంటే మేకర్స్ నుంచి ఇక మీదట అన్నీ వస్తాయని తెలుస్తుంది. ఏప్రిల్ లో అనుకుంటున్నా ఈ సినిమా నుంచి ఇప్పుడు అయితే టీజర్ కానీ సెకండ్ సింగిల్ కోసం కానీ ఎదురు చూస్తున్నారు.
మరి మేకర్స్ అభిమానులకు ఎలాంటి అప్డేట్స్ నుంచి మొదలు పెడతారో చూడాలి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్ మరియు అంజలీలు కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం ఇవ్వగా దిల్ రాజు ప్రిస్టేజియస్ గా నిర్మించారు.