యు/ఏ సొంతం చేసుకున్న అలియాస్ జానకి

యు/ఏ సొంతం చేసుకున్న అలియాస్ జానకి

Published on Jul 16, 2013 4:03 PM IST

Alias-Janaki
అదిరిపోయే ఆడియో తో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమా ‘అలియాస్ జానకి’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవికి బంధువైనటువంటి వెంకట్ రాహుల్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో అనిష అంబ్రోసే హీరోయిన్ గా నటించింది. శ్రవణ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ద్వారా దయా డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. నీలిమ తిరుమలశెట్టి నిర్మిస్తున్న ఈ సినిమాని జూలై 26న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హై లెవల్లో యాక్షన్ మరియు ఎమోషన్స్ ఉంటాయని అందరూ ఆశిస్తున్నారు.

తాజా వార్తలు