ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఫెరోషియస్ లుక్

బాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ గంగూభాయి కటియవాడి. అలియా భట్ ప్రధాన పాత్రలో విమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కుతుంది. ఒకప్పుడు ముంబై లో లేడీ మాఫియాగా చలామణి అయిన ఓ మహిళ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకంలోని ఒక పాత్ర ఈ చిత్రానికి ప్రేరణ. అలియా భట్ గతంలో ఎన్నడూ చేయని ఓ మాఫియా లేడీ రోల్ చేస్తున్నారు.

ఈ చిత్రంలోని తన లుక్ ఒకటి సోషల్ మీడియా వేదికగా అలియా పంచుకున్నారు. నుదుటిపై ఎర్రని బొట్టు సాంప్రదాయ వస్త్రాలంకరణలో ఉన్న ఆమె చూపులో పొగరు, ధైర్యం కనిపిస్తుంది. గంగూ భాయిగా మరో ఛాలెంజింగ్ రోల్ లో అలియా తన ప్రత్యేకత చాటుకోనుందని అర్థం అవుతుంది. ఈ చిత్రం 2020 సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అలియా అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న చరణ్ సరసన నటిస్తుంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా,ఆర్ ఆర్ ఆర్ మూవీ జులై 30న విడుదల కానుంది.

Exit mobile version