యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో జక్కన రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. దేశ వ్యాప్తంగా కూడా మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక దీనితో పాటుగా ఈ మార్చ్ లోనే చరణ్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పై ఓ బ్యూటిఫుల్ సాంగ్ ను ప్లాన్ చేసారు.
కానీ ఇప్పుడు అది కాస్త ప్రశ్నర్ధకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే నిన్ననే పలువురు బాలీవుడ్ బడా స్టార్స్ కు కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. దీనితో ఆలియా కూడా వారితో సన్నిహితంగా ఉండగా తాను కూడా టెస్ట్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం తాను స్వీయ ఏకాంతంలో ఉంది. మరి ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ కనుక వస్తే మళ్లీ ఈ సాంగ్ వాయిదా పడటం తప్పనిసరి అని చెప్పాలి. మరి ఈ టైం లో ఆలియా ఎఫెక్ట్ ఎంత మేర ఉంటుందో చూడాలి..