యూఎస్ లో ఆ రికార్డు బన్నీదే..!

యూఎస్ లో ఆ రికార్డు బన్నీదే..!

Published on Feb 2, 2020 9:47 AM IST

సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల కాంబో అల వైకుంఠపురంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. బన్నీ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు అనేక రికార్డ్స్ ఈ చిత్రం సాధించింది. తెలుగు రాష్ట్రాలలో పాటు ఓవర్సీస్ లో అల వైకుంఠపురంలో విశేష ఆదరణ దక్కించుకుంది. ఇక యూఎస్ లో బన్నీ అధికారికంగా నాన్ బాహుబలి రికార్డ్ తన పేరున నమోదు చేసుకున్నారు. $3.52 మిలియన్ వసూళ్లతో అల వైకుంఠపురంలో, రామ్ చరణ్ రంగస్థలం పేరున ఉన్న రికార్డ్ దాటివేశాడు. యూఎస్ లో అల వైకుంఠపురంలో బాహుబలి చిత్రాల తరువాత థర్డ్ హైయెస్ట్ గ్రాస్సర్ గా నిలిచింది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, సుశాంత్,టబు, జయరాం,మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు.

తాజా వార్తలు