‘గమ్యం’, వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న క్రిష్ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. క్రిష్ ని బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ ఎంపిక చేసుకున్నాడు. హిందీలో తెరకెక్కనున్న తమిళ రీమేక్ ‘రమణ’ సినిమాకి క్రిష్ డైరెక్టర్. ఇదే సినిమా తెలుగులో చిరంజీవి హీరోగా ‘ఠాగూర్’ గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి సంజయ్ లీలా బన్సాలి కూడా ఓ నిర్మాత.
ఈ వార్త అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మామూలుగా అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు – సోనాక్షి సిన్హా జంటగా నటించనున్న సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాలి. కానీ ఇంతవరకూ ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఈ సినిమా ఇప్పటికే విడుదలైన అన్ని భాషల్లో బాక్స్ ఆఫీసు వద్ద తన స్టామినాని నిరూపించుకుంది. కావున అక్షయ్ కుమార్ – క్రిష్ కలిసి 100 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాతో మన ముందుకు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు.