‘రయ్ రయ్’ అంటున్న అక్ష

‘రయ్ రయ్’ అంటున్న అక్ష

Published on Aug 24, 2012 8:10 AM IST


కందిరీగ సినిమాతో ప్రేక్షకులకి దగ్గరయ్యే ప్రయత్నం చేసిన అక్ష ఆ తరువాత పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో డీలా పడిపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ సరసన ‘శత్రువు’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈరోజుల్లో ఫేం శ్రీ మాస్ హీరో పాత్రలో నటిస్తున్న రయ్ రయ్ సినిమాలో అక్ష అంగీకరించినట్లు సమాచారం. సుదీర్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బిఆర్ కృష్ణ మరియు ఎస్ఎన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మడత కాజ మరియు సుడిగాడు సినిమాలకి సంగీతం అందించిన నూతన సంగీత దర్శకుడు శ్రీ వసంత్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు