‘మిణుగురులు’కి ‘అక్కినేని వంశీ ఇంటర్నేషనల్ అవార్డు’

‘మిణుగురులు’కి ‘అక్కినేని వంశీ ఇంటర్నేషనల్ అవార్డు’

Published on Feb 3, 2014 4:56 PM IST

minugurulu-telugu-review
జనవరి 24న తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిణుగురులు’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చడమే కాకుండా అందరి మెప్పును కూడా పొందింది. అలాగే విడుదలకి ముందే బెంగళూరు లో జరిగిన 9వ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘బెస్ట్ ఇండియన్ ఫిల్మ్’ గా ఎంపికైంది. తాజాగా ఈ చిత్రానికి మరో గుర్తింపు లభించనుంది.

వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఈ సంవత్సరం నుంచి ‘అక్కినేని వంశీ ఇంటర్నేషనల్ అవార్డు’ని బహుకరించనున్నారు. ఈ సంవత్సరానికి గాను ఆ అవార్డును మిణుగురులు చిత్రానికి ఇవ్వనున్నట్లు అనౌన్స్ చేసారు. ఫిబ్రవరి 11వ తేదీన శ్రీ త్యాగరాయ గానసభలో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ఈ చిత్ర నిర్మాత, దర్శకుడు అయిన అయోధ్య కుమార్ కృష్ణం శెట్టికి అందజేయనున్నారు.

తాజా వార్తలు