మనం తో మనోడి దశ తిరిగినట్లేనా??

Akkineni-Family
అక్కినేని వంశంలో మూడు తరాల తారలు(నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య) కలిసి నటిస్తున్న సినిమా ‘మనం’ గా మన ముందికి రానుంది. ‘ఇష్క్’ సినిమా తీసిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పాటల భాద్యతని దర్శకుడు అనూప్ రుబెన్స్ పైన ఉంచాడట. ఇదివరకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి పెద్ద సినిమాకి ఆడియో డైరెక్టర్ గా దిల్ రాజు మిక్కి జే . మేయర్ పేరు అనౌన్స్ చేసిన వెంటనే షాక్ కి గురయినట్టు ఈ వార్త విని కుడా సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

అనూప్ ఇదివరకు అందించిన ‘ఇష్క్’ పాటలు ఇప్పటికీ శ్రోతల చేవులలో వినబడుతునే ఉన్నాయి. ఈ వార్త కనుక నిజమైతే అనూప్ తనకున్న టాలెంట్ తో ‘మనం’ సినిమాకి మంచి ఆల్బం ఇచ్చి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల రేసులో నిలవచ్చు. అనూప్ ఇప్పటికే నాగచైతన్య నటిస్తున్న ‘ఆటో నగర్ సూర్య ‘ సినిమాకి సంగీతం అందించాడు.

Exit mobile version