అందరు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అక్కినేని కుటుంబం యొక్క మల్టీ స్టారర్ సినిమా ‘మనం’ పూజ కార్యక్రమాలు ఈ రోజు జరిగాయి. ఈ సినిమాలో తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వర్ రావు గారు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య హీరోలు నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన సమంత, నాగార్జున సరసన శ్రియ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ వేడుకని నాగార్జున ట్వీట్ చేశారు. ‘ ‘మనం’ సినిమా పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది మా అందరికి చాలా ఎమోషినల్ డే. మా అమ్మ కూడా మమ్మల్ని దీవించింది’. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.