అక్కినేని వారి మూడు తరాల సినిమా ‘మనం’?

Akkineni-Family
అక్కినేని వంశంలోని మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి ఒక సినిమా చేయనున్నారనేది తెలిసిన విషయమే. ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. ముందుగా ఈ సినిమాకి ‘త్రయం’ అనే పేరును అనుకున్నారు, ఆ తర్వాత ‘హమ్’ అనే టైటిల్ అనుకున్నారు అనే వార్తలు వినిపించాయి. తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘మనం’ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించనున్నారు.

Exit mobile version