రొమాన్స్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ హైలైట్ అట !

రొమాన్స్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ హైలైట్ అట !

Published on Apr 12, 2020 7:59 PM IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ చాల కొత్తగా ఉంటాయట. ముఖ్యంగా అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. సినిమాలో లిప్ టు లిప్ కిస్ కూడా ఉంటుందట. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట.

కాగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడా..? ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి . దాంతో ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు.

తాజా వార్తలు