లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి మంచి హిట్ చిత్రాల్లో టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ధురంధర్” కూడా ఒకటి. మరి ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి సాలిడ్ వసూళ్లు కూడా రాబడుతుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం ఇప్పుడు ఆడియెన్స్ లో ఒక టాక్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.
ఈ సినిమాలో హీరో రణ్వీర్ సింగ్ అయినప్పటికీ విలన్ పాత్రలో చేసిన టాలెంటెడ్ నటుడు అక్షయే ఖన్నా పెర్ఫామెన్స్ కోసమే చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకొందరు అయితే రణ్వీర్ నే తాను డామినేట్ చేసాడని కూడా అంటున్నారు. దీనితో సినిమాలో తన పెర్ఫామెన్స్ ఏ లెవెల్లో ఇంపాక్ట్ చూపిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది ‘ఛావా’లో కూడా విలన్ రోల్ లో తాను మెప్పించారు. ఇందులో అయితే దానికి మించి ఉంది అంటున్నారు.
