‘మనం’లో అతిధి పాత్రలో కనిపించనున్న అఖిల్

Akhil
యంగ్ అండ్ హన్డ్సం అఖిల్ అక్కినేని రానున్న అక్కినేని మూడు తరాల సినిమా ‘మనం’ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. మేము విన్న తాజా సమాచారం ప్రకారం ఈ రోజు అఖిల్ మనం సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమాలో అఖిల్ అతిధి పాత్రలో కనిపిస్తాడని మనం ఆశించవచ్చు. ఎఎన్ఆర్ గారు, నాగార్జున, నాగ చైతన్య కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు.

విక్రం కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈఎ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ‘మనం’లో సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ విషయం తర్వాత అక్కినేని ఫ్యాన్స్ మరింత ఎక్కువగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ‘మనం’ 2014 మొదట్లో ప్రేక్షకుల ముందు రానుంది.

Exit mobile version