యాక్షన్ ఎంటర్టైనర్స్ పై ఆసక్తి చూపుతున్న అఖిల్ అక్కినేని

Akhil-Akkineni

‘కింగ్’ అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అకిల్ అక్కినేని త్వరలోనే హీరోగా తెలుగు వారికి పరిచయం కానున్నాడు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నాగార్జున ఈ విషయాన్ని తెలియజేశారు. కానీ అఖిల్ తొలి సినిమా కోసం ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు?.. అఖిల్ మరియు నాగార్జున తొలి సినిమాకి సరైన స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీలోని అందరూ మాస్ టచ్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ మొదటి సినిమా అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారని సమాచారం.

మరోవైపు ఎవరు అఖిల్ తొలి సినిమాని డైరెక్ట్ చేస్తారు? అనేది ఇంకా తెలియలేదు. కానీ ఒకటి మాత్రం నిజం , అఖిల్ కి అక్కినేని బ్రాండ్ కార్డ్ ఉండడం వల్ల లాంచ్ చేసే విషయంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

Exit mobile version