అఖండ 1′.. ‘అఖండ 2’.. గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యిందా?

అఖండ 1′.. ‘అఖండ 2’.. గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యిందా?

Published on Dec 6, 2025 7:30 PM IST

Akhanda-2

గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటించిన అవైటెడ్ సెన్సేషనల్ చిత్రమే అఖండ 2 తాండవం. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ అవైటెడ్ సినిమా గ్రాండ్ గా ఈపాటికే థియేటర్స్ లో పడాల్సి ఉంది కానీ ఈ సినిమా ఊహించని విధంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. అయినప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈ పార్ట్ 2 కి మాత్రం పార్ట్ 1 రేంజ్ లో ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యిందా అనిపిస్తుంది అని చెప్పాలి.

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న అఖండ 2?

అఖండ 2 కి ఎందుకు గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యింది అంటే గతంలో వచ్చిన అఖండ పార్ట్ 1 సరిగ్గా ఇదే డిసెంబర్ నెల ఇదే మొదటి వారంలో థియేటర్స్ లోకి వచ్చి సంచలన విజయం సాధించింది. కరోనా లాంటి సమస్యలు ఉన్నప్పటికీ తెలుగు సినిమా దగ్గర ఈ ఆ మధ్యలో కనుమరుగు అయ్యిపోయిన పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది అఖండ 1.

అంతేనా నెవర్ బిఫోర్ లాంగ్ రన్ ని కూడా ఆ సినిమా చూసింది. మరి అలాంటి బలమైన సమయంలోనే వచ్చి మళ్ళీ హిస్టరీ రిపీట్ చేస్తుంది అనుకున్న పార్ట్ 2 మాత్రం రిలీజ్ ఇబ్బందుల్లో పడింది. ఇది కూడా మొదటి వారంలోనే విడుదలై, పార్ట్ 1 లానే టాక్ పడి ఉంటే మాత్రం బాలయ్య, బోయపాటి మరోసారి తాండవం ఆడేవారు కానీ అది మిస్ అయ్యిందనే చెప్పాలి.

పార్ట్ 1 రేంజ్ లో లాంగ్ రన్ పడే అవకాశాలు తక్కువ?

అప్పుడు సినిమాకి రెండు వారాల వ్యవధిలో పుష్ప 1 వచ్చింది. అయినప్పటికీ అఖండ 1 ఎక్కడా తగ్గకుండా భారీ వసూళ్లు సాధించింది. కానీ ఇప్పుడు లేట్ అయితే మాత్రం ఇతర సినిమాల సంఖ్య కొంచెం ఎక్కువే ఉంది. ఎంత గట్టి టాక్ వచ్చినా కూడా థియేటర్స్ కొరత ఎఫెక్ట్ కనిపిస్తుంది. దీని ఫలితం వసూళ్లపై కూడా ప్రభావం ఉంటుంది. సో డిసెంబర్ 25 డేట్ లోనే వస్తే మాత్రం అఖండ 1 రేంజ్ లో లాంగ్ రన్ ఉంటుందా లేదా అనేది కొంచెం అనుమానమే అని చెప్పక తప్పదు. సో పార్ట్ 2 ముందు చాలానే సవాళ్లు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు