నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం” (Akhanda 2). బాలయ్య కెరీర్ లోనే నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకొని ఈ సినిమా రిలీజ్ కి రాబోతుంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఊహించని విధంగా చిట్టచివరి నిమిషంలో వాయిదా పడింది. ఇక కొత్త డేట్ కోసం అందరూ మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఆగినప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదని చెప్పాలి.
బుక్ మై షోలో 3 లక్షల మంది ఇంట్రెస్ట్స్..
అఖండ 2 (Akhanda 2 Thandavam) ఆగకముందు బుక్ మై షోలో ఇంట్రెస్ట్స్ దాదాపు 2 లక్షల దగ్గరలో ఉండేవి కానీ వాయిదా పడిన తర్వాత క్రేజ్ మరింత లెవెల్లో పెరిగింది. కేవలం ఈ రెండు రోజుల్లోనే అదనంగా మరో లక్ష మంది సినిమాపై ఇంట్రెస్ట్ చూపించారు. దీనితో బుక్ మై షోలో అఖండ 2 కి 3 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ నమోదు అయ్యాయి.
టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఫస్ట్ ఎవర్ ఫీట్?
ఇప్పుడు మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో బాలయ్య ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. మరి ఇలా మన సీనియర్ హీరోస్ సినిమాల్లో ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న సినిమాగా ఇప్పుడు తెలుస్తుంది.
చిరంజీవి సినిమా కూడా ఏం తక్కువ కాదు
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” (Vishwambhara) పై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు కానీ ఈ సినిమాకి ఆల్రెడీ 2 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. దానిని అఖండ 2 ఇపుడు క్రాస్ చేసింది. ఫ్యూచర్ లో దీనిని విశ్వంభర క్రాస్ చేసే ఛాన్స్ ఉంది.
