ఒక తమిళ్ సినిమాకుగానూ అజిత్, తమన్నా మొదటిసారిగా జతకట్టనున్నారు. శౌర్యం శివ ఈ సినిమాకు దర్శకుడు. ఈ రోజు ఉదయం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యింది. అజిత్ ఇప్పటికే షూటింగ్లో పాల్గొనగా తమన్నా మరి కొన్ని రోజుల్లో వీరితో కలవనుంది. ఈ సినిమా విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 20 వరకు జరగనుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అజిత్ గత చిత్రం ‘మంకత్త’, (తెలుగులో గ్యాంబ్లర్) ఇక్కడ కుడా ప్రేక్షకాదరణ పొందింది. అతను చివరిగా నటించిన ‘డేవిడ్ బిల్లా’ ఫ్లాప్ అయినా అతని మీద అంచనాలు తగ్గలేదు. ప్రస్తుత చిత్రమే కాక అతను విష్ణువర్ధన్ దర్శకత్వంలో నాయనతార, తప్సీ మరియు ఆర్య ప్రధాన పాత్రలలో మరో సినిమా ఒప్పుకున్నాడు.