పవన్ సినిమాలో ఐశ్వర్య ? గోల్డెన్ ఛాన్స్ అనే అనాలి

పవన్ సినిమాలో ఐశ్వర్య ? గోల్డెన్ ఛాన్స్ అనే అనాలి

Published on Nov 4, 2020 12:16 AM IST


టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టే హీరోయిన్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ సరసన సినిమా చేయాలని అనుకుంటారు. పవర్ స్టార్ సినిమాలో చేస్తే మంచి స్టార్ డమ్, స్టార్ హీరోయిన్ స్టేటస్ తప్పకుండా వస్తాయి. అందుకే పవన్ సినిమాలో ఆఫర్ కోసం ఎదురుచూస్తుంటారు చాలామంది. అయితే పవన్ చేసేది తక్కువ సినిమాలే కాబట్టి ఆయన సరసన నటించే అవకాశం కూడ కొద్దిమందికే వస్తుంటుంది. ఇప్పుడు ఆ గోల్డెన్ ఛాన్స్ ఐశ్వర్య రాజేష్ దక్కించుకున్నట్టు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పూర్తవగానే సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేస్తారు. ఇందులో ఆయన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో పవన్ సరసన కథానాయకిగా ఐశ్వర్య రాజేష్ అయితే బాగుంటుందని ఆమెను ఫైనల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవల ‘కౌశల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి సినిమాల్లో మంచి నటన కనబర్చి మెప్పించింది ఐశ్వర్య. అందుకే నటనకు ప్రాధాన్యమున్న ఈ పాత్రలో ఆమెకు అవకాశం దొరికిందట. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెండవ ముఖ్యమైన పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు